జగపతిబాబు పాత్రపై వీడియో

గేమ్‌ఛేంజర్‌ తర్వాత కథానాయకుడు రామ్‌చరణ్‌ నటిస్తున్న కొత్త సినిమా షూటింగ్‌ వేగంగా కొనసాగుతోంది. ఉప్పెన ఫేమ్‌ బుచ్చిబాబు సన దర్శకత్వం వహిస్తున్నారు. నటుడు జగపతిబాబు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో ఉంచారు. ఈ చిత్రంలో తన పాత్ర కోసం మేకోవర్‌ చేస్తున్న వీడియోను జగపతిబాబు సోషల్‌ మీడియాలో పంచుకున్నారు. ‘చాలాకాలం తర్వాత బుచ్చిబాబు ఆర్‌సీ కోసం మంచి పని పెట్టాడు. గెటప్‌ చూసిన తర్వాత నాకు చాలా తృప్తిగా అనిపించింది’ అని ట్విటర్‌లో పోస్ట్‌చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఆర్‌సి 16గా తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో రామ్‌చరణ్‌ నరసన దేవర కథానాయిక జాన్వీకపూర్‌ నటించనున్నారు. స్పోర్ట్స్‌ డ్రామాగా, గ్రామీణ నేపథ్యంలో సాగే కథతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

➡️