Video Viral – మనోజ్‌ను చూసి మంచు లక్ష్మి ఎమోషనల్‌

తెలంగాణ : మంచు ఫ్యామిలీలో అన్నదమ్ముల మధ్య పెద్ద ఎత్తున గొడవలు జరుగుతున్నాయి. వీరి తండ్రి మోహన్‌ బాబు కూడా మంచు విష్ణుకు మద్దతుగా నిలిచారు. దీంతో మనోజ్‌ తనకు న్యాయం చేయాలంటూ … జల్‌ పల్లిలోని ఇంట్లో తన వస్తువులు ఉన్నాయని వాటిని తీసుకెళ్లడానికి అవకాశం ఇవ్వాలని ఇటీవల ఆ ఇంటి ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. తాజాగా హైదరాబాద్‌ వేదికగా ప్రతి ఏడాది సెలబ్రిటీ ఫ్యాషన్‌ షో జరుగుతుంటుంది. శనివారం రాత్రి జరిగిన ఈవెంట్‌లో తన సోదరిని సర్‌ప్రైజ్‌ చేస్తూ నటుడు మనోజ్‌ ఆయన భార్య మౌనిక పాల్గొన్నారు. మనోజ్‌ను చూసిన వెంటనే లక్ష్మి ఎమోషనల్‌ అయ్యారు. ఆయన్ని ప్రేమగా హత్తుకుని భావోద్వేగానికి గురయ్యారు. పక్కనే ఉన్న మౌనిక ఆమెను ఓదార్చే ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరలవుతుంది.

➡️