విజయ్ ఆంటోని ‘తుఫాన్‌’ అప్డేట్‌

May 21,2024 19:20 #movie, #vijay antoni

విజయ్ ఆంటోని కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘తుఫాన్‌’. విజయ్ మిల్టన్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇన్ఫినిటీ ఫిల్మ్‌ వెంచర్స్‌ పతాకంపై కమల్‌ బోరా, డి.లలితా, బి.ప్రదీప్‌, పంకజ్‌ బోరా నిర్మిస్తున్నారు. ‘తనను చిన్నచూపు చూసే సమాజాన్ని సంస్కరించి వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చే వ్యక్తి కథ ఇది. ఓ దీవి నేపథ్యంలో కథ సాగుతుంది. అండమాన్‌, డయ్యూ డామన్‌లలో చిత్రీకరణ జరిపాం. ప్రస్తుతం షూటింగ్‌ తుదిదశలో ఉంది. ఈ నెల 29న టీజర్‌ను విడుదల చేస్తున్నాం’ అని తాజాగా చిత్ర విశేషాలపై దర్శకుడు మాట్లాడారు. శరత్‌కుమార్‌, సత్యరాజ్‌, డాలీ ధనుంజయ, మేఘా ఆకాష్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి అచ్చు రాజమణి, విజయ్ ఆంటోని సంగీతం అందిస్తున్నారు.

➡️