శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్, దిల్ రాజు నిర్మాణంలో విజయ్ దేవరకొండ ఓ సినిమా చేయబోతున్నారు. ‘రాజావారు రాణిగారు’ చిత్రంతో దర్శకుడిగా తనదైన మార్క్ చూపించిన రవికిరణ్ కోలా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్‌వీసీ సంస్థ నిర్మిస్తున్న 59వ చిత్రమిది. దిల్ రాజు – శిరీష్ నిర్మాతలు. తాజాగా శనివారం ఈ చిత్రానికి సంబంధించిన అప్‌డేట్‌ను వేంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ ప్రకటించింది. లార్జర్ దేన్ లైఫ్ అన్నట్లు రూరల్ యాక్షన్ డ్రామాతో ఈ చిత్రం తెరకెక్కనుందని తెలిపారు. మే 9న ఈ సినిమాకు సంబంధించి ఇతర వివరాలు వెల్లడిస్తారు.
