‘కల్లా కపటం లేని బతుకులతో, పరస్పరం సాయం చేసుకునే బుద్ధులతో, అన్నా, మామా, అత్తా, అన్న వరసలతో పల్లె అంతా ఒక్క కుటుంబంగా కనబడేదీ గ్రామీణ ప్రాంతాల్లోనే. పల్లె జనుల హాస్యాలు, సరసాలు, ప్రోత్సాహాలు, అన్నీ అమాయక ధోరణిలో ఎంతో ఆహ్లాదాన్ని కల్గిస్తుంటాయి. చక్కని సహజ ధోరణిలో పల్లెపాటలు, మాటలు గ్రామీణ జీవనంలో భాగమై పెనవేసుకుని ఉంటాయి. అలాంటి సంస్కృతీ వారసత్వం భావితరాలకు తెలియజేయాలనే లక్ష్యంతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాం’ నిర్మాత డాక్టర్ కుమార్ నాయక్ అన్నారు. ఎఆర్‌కె వరల్డ్ క్రియేషన్స్ బ్యానర్‌పై అమ్మ రామకృష్ణ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఎస్.చిరంజీవి సమర్పణలో ప్రముఖ జానపద నృత్యకళాకారుడు పత్రి తాతారావు క్లాప్ కొట్టగా షూటింగ్ ప్రారంభమైంది. డైరెక్టర్ పి.యశోద, అసిస్టెంట్ డైరెక్టర్ ఇందుపల్లి మోహన్, బాలనటుడు నిహాల్‌రెడ్డి, నటులు అనీల్‌కుమార్, తోట సింహాచలం, టి.విష్ణుమూర్తి, కనమ్మ, మాధవి తదితరులు పాల్గొన్నారు. ఉత్తరాంధ్రలోని పలాస- మెళియాపుట్టి సరిహద్దు గ్రామాల్లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది.