చెన్నై : ప్రముఖ కోలీవుడ్ స్టార్ విజయ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ‘తమిళ వెట్రి కళగం’ అనే పేరుతో తన పార్టీ పేరును కూడా విజరు ఇటీవల ప్రకటించారు. దళపతి విజయ్ బాటలోనే కోలీవుడ్ స్టార్ విశాల్ కూడా పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారని తమిళనాట జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే విశాల్ పార్టీ ఏర్పాటుకు సంబంధించి సన్నాహాలు మొదలుపెట్టినట్లు సమాచారం. ఆ రాష్ట్రంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్ని (2026) టార్గెట్‌గా చేసుకునే విశాల్ పార్టీని పెట్టబోతున్నారని, త్వరలోనే పార్టీకి సంబంధించి అధికారిక ప్రకటన చేయనున్నట్లు సమాచారం.
కాగా, గతంలో విశాల్ పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నట్లు ప్రకటించారు కూడా. గతంలో చెన్నై ఆర్కే నగర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆయన నామినేషన్ కూడా వేశారు. అయితే ఆ నామినేషన్ కొన్ని కారణాల వల్ల తిరస్కరణకు గురైంది. విశాల్ రాజకీయ ఎంట్రీ ఆలస్యమైనా.. తాను పలు సేవా కార్యక్రమాల్ని కొనసాగిస్తూనే ఉన్నారు. వదరల సమయంలో విశాల్ ప్రజల్ని ఆదుకున్నారు.