మా నాలుగో పెళ్లిరోజునే పాప పుట్టింది : విష్ణువిశాల్‌ గుత్తా జ్వాల

అమరావతి : సినీనటుడు విష్ణు విశాల్‌, బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి గుత్తా జ్వాలకు పండంటి ఆడపిల్ల పుట్టింది. ఈ శుభవార్తను ఆ జంట ఎక్స్‌ వేదికగా తెలిపారు. ” మాకు ఆడపిల్ల పుట్టింది. ఆర్యన్‌ ఇప్పుడు అన్నయ్య అయ్యాడు. మా నాలుగో పెళ్లి రోజు నాడు పాప పుట్టడం మరింత ఆనందంగా ఉంది. మాకు దేవుడు ఇచ్చిన బహుమతిగా భావిస్తున్నాం. మీ అందరి ప్రేమ, ఆశీర్వాదం కావాలి ” అని తెలుపుతూ ఎక్స్‌లో ఓ ఫొటో పంచుకున్నారు. దీంతో ఈ జంటకు ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 2021 ఏప్రిల్‌ 22న వీరిద్దరూ వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఇప్పుడు నాలుగేళ్ల తర్వాత ఇదే రోజు పాప పుట్టడం ఎంతో స్పెషల్‌ అంటూ నెటిజన్‌లు కామెంట్స్‌ పెడుతున్నారు.

➡️