చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న తాజా సినిమా ‘విశ్వంభర’ నుండి తాజాగా ‘రామ రామ..’ అంటూ సాగే పాట విడుదల చేశారు. ఈ గీతాన్ని రామజోగయ్య శాస్త్రి రాశారు. శంకర్ మహదేవన్, లిప్సిక ఆలపించారు. ఎం.ఎం కీరవాణి సంగీతం అందించారు. వశిష్ట మల్లిడి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. యువి క్రియేషన్స్ పతాకం మీద విక్రమ్, వంశీ, ప్రమోద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తి అయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలో సినిమా విడుదల తేదీని అనౌన్స్ చేయనున్నారు. త్రిష కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో ఆశికా రంగనాథ్ మరొక హీరోయిన్. బాలీవుడ్ నటుడు కునాల్ కపూర్ విలన్ రోల్ చేస్తున్నారు. సురభి, ఇషా చావ్లా, రమ్య పసుపులేటి తదితరులు ఇతర కీలక పాత్రలు చేశారు.
