‘విశ్వం’.. ఎమోషనల్‌ సాంగ్‌ విడుదల

Sep 25,2024 18:29 #emotional song, #movies, #released, #Viswam

గోపీచంద్‌ హీరోగా, శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం ‘విశ్వం’. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, చిత్రాలయం స్టూడియోస్‌ పతాకాలపై టీజీ విశ్వప్రసాద్‌, వేణు దోనెపూడి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. దసరా సందర్భంగా అక్టోబర్‌ 11న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం మ్యూజికల్‌ ప్రమోషన్స్‌ వేగం పెంచింది. తాజాగా ‘మొండితల్లి పిల్ల..’ అంటూ సాగే పాటను విడుదల చేశారు. చేతన్‌ భరద్వాజ్‌ స్వరపరచిన ఈ పాటను శ్రీహర్ష రచించారు. తల్లీకూతుళ్ల బంధాన్ని ఆవిష్కరిస్తూ ఈ పాట సాగింది. ‘అడుగే తడబడితే.. ఇదిగో నీ వెనకే ఉంటానులే.. చిన్నారి తల్లి.. కలలో భయపడకు..ఎపుడూ నీ కునుకై ఉంటానులే చిన్నారి తల్లి.. మొండితల్లి పిల్ల నువ్వు’ అంటూ ఎమోషనల్‌గా ఈ పాటను తీర్చిదిద్దారు. గోపీచంద్‌ పాత్ర గత చిత్రాలకు భిన్నంగా ఉంటుందని చిత్ర బృందం పేర్కొంది. కావ్య థాపర్‌, వెన్నెల కిషోర్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : కె.వి.గుహన్‌, సంగీతం : చైతన్‌ భరద్వాజ్‌ అందిస్తున్నారు.

➡️