ఎస్‌ఎస్ క్రియేషన్స్ బ్యానర్‌పై శివశంకర్ రచన, దర్శకత్వంలో డాక్టర్ కుమార్ నాయక్ సమర్పణలో తెరకెక్కుతున్న సినిమా ‘వెయిటింగ్’. తెలుగు, హిందీ, ఒరియాలో భాషల్లో తెరకెక్కుతోంది. గత వారం రోజులుగా రెగ్యులర్ షూటింగ్ కొనసాగుతోంది. గోపాల్‌రెడ్డి, శృతి నటీనటులు. బాలనటుడు నంద గోపాల్, కీలక పాత్రలో కుమార్ నాయక్, ఆశిష్, పత్రి తాతారావు నటిస్తున్నారు. ప్రేమ ఇతివృత్తంగా సాగే ఈ సినిమా ఆద్యంతం సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఉంటుందని డైరెక్టర్ శివ తెలిపారు.