‘వీకెండ్‌’ షూటింగ్‌ ప్రారంభం

Nov 27,2024 19:25 #Film shootings, #moives, #weekend movie

విఐపి శ్రీ నటుడిగా, ప్రియా దేశపాగ నటిగా నటిస్తున్న చిత్రం ‘వీకెండ్‌’. ఖడ్గధార మూవీస్‌ బ్యానర్‌లో ఐడి భారతి నిర్మాతగా ఈ సినిమా షూటింగ్‌ చీరాలలోని సెయింట్‌ ఆన్స్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌లో బుధవారం ప్రారంభమైంది. ఎన్‌ఆర్‌ఐ లేళ జయ కెమెరా రోల్‌ చేయగా, సినీ నటుడు అజయ్ ఘోష్‌ మొదట క్లాప్‌ కొట్టారు. బి.రాము రచయిత, దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంగా దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ మొదటి షెడ్యూల్‌ మొత్తం చీరాల ప్రాంతంలోనే చిత్రీకరణ జరుగుతుందన్నారు. కమర్షియల్‌ థ్రిల్లర్‌గా ఈ సినిమాను తెరకెక్కించబోతున్నామని వివరించారు.

➡️