‘కల్కి’ ట్రైలర్‌ డేట్‌ ఫిక్స్‌..ఎప్పుడంటే..

Jun 5,2024 20:25 #movie, #prabhas

హైదరాబాద్‌ : ప్రభాస్‌ ‘కల్కి2898’ ట్రైలర్‌కు డేట్‌ ఫిక్స్‌ అయింది. ఈ నెల 10వ తేదీన ఈ సినిమా ట్రైలర్‌ రిలీజ్‌ కానుంది. ఈ మేరకు కల్కి టీం అధికారిక ప్రకటన చేసింది. ఓ పోస్టర్‌ ద్వారా ఈ విషయాన్ని చిత్ర బఅందంపేర్కొంది. కాగా, నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో పాన్‌ ఇండియా హీరో ప్రభాస్‌ నటిస్తోన్న తాజా చిత్రం కల్కి 2898 ఏడీ .ఈ సైన్స్‌ ఫిక్షన్‌ అండ్‌ యాక్షన్‌ మూవీపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. హాలీవుడ్‌ రేంజ్‌ లో తెరెకెక్కుతున్న ఈ సినిమా కోసం ఆడియన్స్‌ కూడా ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు. దీంతో ఈ సినిమా గురించి వినిపిస్తున్న చిన్న న్యూస్‌ ఐనా క్షణాల్లో వైరల్‌ అవుతోంది. కాగా ఈ చిత్రం లో అమితాబ్‌, కమల్‌హాసన్‌, దీపిక పదుకొణే, దిశా పటానీ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదల అయిన పోస్టర్స్‌, గ్లింప్స్‌లకు మంచి స్పందన వచ్చింది.

➡️