‘పుష్ప 2’ టీజర్‌ విడుదల ఎప్పుడో?

Oct 28,2024 19:40 #actor Allu Arjun, #movies, #Pushpa-2

అల్లు అర్జున్‌ హీరోగా, రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించిన సినిమా ‘పుష్ప 2’. డిసెంబర్‌ 5న విడుదల కానున్న ఈ సినిమా ప్రచార కార్యక్రమాల్లో మేకర్లు, చిత్ర యూనిట్‌ ప్రయత్నాలను ప్రారంభించింది. ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ ఎక్కడ నిర్వహించాలనే విషయమై ఇప్పటికే మేకర్లు మల్లగుల్లాలు పడుతున్నారు. హైదరాబాద్‌ నగరంలో ఈనెల 28 నుంచి నవంబర్‌ 28 సాయంత్రం ఆరు గంటల వరకూ హైదరాబాద్‌లో పోలీసుల ఆంక్షలు ఉన్నాయి. సభలు, సమావేశాలు, ధర్నాలు, రాస్తారోకోలు, ర్యాలీలపై నిషేధం విధించినట్లు కమిషనర్‌ సివి ఆనంద్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లో కుదరకపోతే రాష్ట్రంలోని ఏ ప్రాంతంలో నిర్వహిస్తారనే విషయమై ఇప్పుడు ఆసక్తికరంగా చర్చలు జరుగుతున్నాయి. ‘పుష్ప 2’ ప్రీ రిలీజ్‌ కార్యక్రమం ఎపిలో జరుగుతుందా? లేక ఈవెంట్‌ లేకుండానే థియేటర్లలో విడుదల అవుతుందా? అనేది వేచిచూడాల్సిందే.

➡️