‘సినిమాలు ఏ తేదీన విడుదల కావాలి? ఎప్పుడు విడుదల కావాలి? ఎన్ని థియేటర్లు ఇవ్వాలో రెడ్ జెయింట్ డిసైడ్ చేస్తోంది. మేం ఎక్కడెక్కడి నుంచో వడ్డీలకు డబ్బులు తీసుకొచ్చి, కష్టపడి సినిమాలు తీస్తుంటే.. ఎవరో ఒకరు ఏసీ రూంలో కూర్చుని నిర్ణయిస్తారా? అసలు మీరెవరు అలా చెప్పడానికి? మీకా అధికారం, హక్కు ఎవరిచ్చారు’ అని తమిళ హీరో విశాల్ మండిపడ్డారు. ‘రత్నం’ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాల్లో భాగంగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ప్రముఖ నిర్మాణ సంస్థ రెడ్ జెయింట్ పిక్చర్స్ తీరుపై మండిపడ్డారు. విశాల్ గత చిత్రాలు ‘ఎనిమీ’, ‘మార్క్ ఆంటోని’ సినిమాలని వేరే సంస్థ విడుదల చేసింది. దీంతో వీటికి థియేటర్ల కొరత ఏర్పడేలా రెడ్ జెయింట్ పిక్చర్స్ వ్యవహరించింది. చాలామంది నిర్మాతలు ఎందుకులే అని ఊరుకోగా, విశాల్ మాత్రం బహిరంగంగానే విమర్శలు చేశారు.
