తమిళంపై ప్రేమతో…

ప్రయోగాలకు ప్రసిద్ధి గాంచిన సంగీత దర్శకుడు ఎఆర్‌ రెహ్మాన్‌. 1992లో ‘రోజా’ చిత్రం ద్వారా సంగీత దర్శకుడిగా పరిచయమై తొలి చిత్రంతోనే విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత తమిళం, తెలుగు, హిందీ, ఇంగ్లీష్‌ భాషల్లో చిత్రాలకు సంగీతాన్ని అందిస్తూ ప్రపంచవ్యాప్తంగా పేరు గడించారు. ‘స్లమ్‌ డాగ్‌ మిలీనియం’ చిత్రానికిగాను ఆస్కార్‌ అవార్డును గెల్చుకున్న ఆయనకు తమిళభాషపై అమితమైన ప్రేమ. గతంలోనే ‘సెంమ్మొళియన్‌ తమిళ్‌ మొళి’ పేరుతో ఆల్బమ్‌ను రూపొందించి ఖ్యాతి గడించారు. తమిళ భాష కోసం ఒక స్మారక చిహ్నాన్ని రూపొందించటం ద్వారా మరో ప్రయోగానికి సిద్ధమయ్యారు. దీనికి ఎఆర్‌ఆర్‌ ఇమ్మర్‌సీవ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ టీమ్‌ కృషి చేస్తోంది. డిజిటల్‌ రూపంలో ఈ తమిళ్‌ భాషా స్మారక చిహ్నాన్ని త్వరలో నిర్మించనున్నట్లు ఎఆర్‌ రెహ్మాన్‌ తన ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పేర్కొన్నారు. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తామని తెలిపారు.

➡️