యశ్ హీరోగా మలయాళ దర్శకురాలు గీతూమోహన్ దాస్ ‘టాక్సిక్’ అనే సినిమా తెరకెక్కించనున్నారు. గతేడాది ప్రకటించిన ఈ చిత్రం ఇప్పటివరకు పోస్ట్ ప్రోడక్షన్ పనులు జరుపుకుంటూ వచ్చింది. తాజాగా ఈ సినిమా షూటింగ్ గురువారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలు చిత్రయూనిట్ ఎక్స్‌లో షేర్ చేసింది. యశ్ నటిస్తోన్న 19వ చిత్రమే ఈ ‘టాక్సిక్’. ‘ఎ ఫెయిరీ టెల్ ఫర్ గ్రోన్ అప్స్’ అనేది ఉపశీర్షిక. ఈ సినిమాను శరవేగంగా షూటింగ్ కంప్లీట్ చేసి వచ్చే ఏడాది ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. ఇక సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు చిత్రయూనిట్ తెలిపింది.
