కొత్త రిలీజ్‌ డేట్‌లో ‘జీబ్రా’

సత్య దేవ్‌, డాలీ ధనంజయ కలిసి నటించిన మల్టీ-స్టారర్‌ చిత్రం ‘జీబ్రా’. లక్‌ ఫేవర్స్‌ ది బ్రేవ్‌ అనేది ట్యాగ్‌లైన్‌. ఈశ్వర్‌ కార్తీక్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పద్మజ ఫిలింస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, ఓల్డ్‌ టౌన్‌ పిక్చర్స్‌ బ్యానర్లపై ఎస్‌ఎన్‌ రెడ్డి, ఎస్‌.పద్మజ, బాల సుందరం, దినేష్‌ సుందరం నిర్మించారు. తాజాగా చిత్రబృందం ఈ చిత్రం నుండి ప్రధాన పాత్రలను పరిచయం చేస్తూ మోషన్‌ పోస్టర్‌ విడుదల చేసారు. గతంలో ఈ సినిమా అక్టోబర్‌ 31న అన్ని దక్షిణ భారత భాషల్లో, హిందీలో థియేటర్లలోకి రానుందని వెల్లడించారు. అయితే మోషన్‌ పోస్టర్‌లో ఈ సినిమా కొత్త రిలీజ్‌ డేట్‌ను మేకర్స్‌ ప్రకటించారు. నవంబరు 22న ఈ సినిమాని విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.

➡️