Nov 26,2021 09:08

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ శాసన మండలి డిప్యూటీ చైర్మన్‌ పదవికి నామినేషన్‌ దాఖలు అయింది. వైసిపి ఎమ్మెల్సీ జకియా ఖానమ్‌ గురువారం నామినేషన్‌ దాఖలు చేశారు. తొలిసారి మైనారిటీ మహిళకు డిప్యూటీ చైర్మన్‌ పదవి అవకాశం దక్కనుంది. శుక్రవారం డిప్యూటీ చైర్మన్‌ ఎన్నిక జరగనుంది.

ఈ సందర్భంగా ప్రభుత్వ చీఫ్‌ విప్‌ శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ.... జకీయా ఖానమ్‌కు మండలి డిప్యూటీ ఛైర్‌పర్సన్‌ పదవి ఇవ్వడం హర్షదాయకమన్నారు. ఒక మైనారిటీ మహిళను ఎంపిక చేయడం ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయమని పేర్కొన్నారు. ఈ మేరకు సిఎం వైఎస్‌ జగన్‌కు కఅతజ్ఞతలు తెలిపారు. ఇటీవల ఎపి శాసన మండలి ఛైర్మన్‌గా మోషేన్‌ రాజు బాధ్యతలు చేపట్టిన సంగతి విదితమే.