Jul 29,2021 19:32

MOVVALO APTF DHARNA

ఎపిటిఎఫ్‌ ఆధ్వర్యంలో ఆందోళన
ప్రజాశక్తి - మొవ్వ
ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికై గురువారం తహశీల్దార్‌ కార్యాలయం వద్ద ఎపిటిఎఫ్‌ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. సంఘ నాయకులు మాట్లాడుతూ సిపిఎస్‌ రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించాలని కోరారు. పిఆర్‌సి అమలు చేయాలనీ, ప్రతి నెల 1వ తేదీకి జీతాలు, పెన్షన్లు చెల్లించాలని కోరారు. చల్లపల్లి, ఘంటసాల, మొవ్వ మండలం నాయకులు జి వెంకటేశ్వర్‌ రావు, పి శేషయ్య, జి భగవాన్‌, బాలాజీ, సురేష్‌ బాబు, శ్రీనివాస రావు, కవిత, రాధా రాణి తదితరులు పాల్గొన్నారు.