
బ్లాక్ బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడి ఫన్ ఫ్రాంచైజీ 'ఎఫ్3' మూవీని అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించే వినోదాత్మక అంశాలు ఉండేట్లు రూపొందిస్తున్నారు. విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సమ్మర్ సోగ్గాళ్ళుగా సందడి చేయబోతున్న 'ఎఫ్3'... థియేట్రికల్ ట్రైలర్ ద్వారానే ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులకు అలరించబోతుందని రుజువుచేసింది. 'ఎఫ్3' మ్యూజికల్ ప్రమోషన్స్ లో భాగంగా ఇప్పటికే ఎఫ్ 3 నుండి విడుదలైన రెండు పాటలు చార్ట్ బస్టర్స్‌గా నిలిచాయి. ఇప్పుడు ''లైఫ్ అంటే ఇట్లా వుండాలా' అనే పాటతో అలరించబోతుంది పూజా హెగ్డే. మే 17 ఈ పాట లిరికల్ వీడియో ని విడుదల చేయనున్నారు. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ పాట కోసం చేసిన ట్యూన్ అదిరిపోయింది. ప్రోమో విడుదలైన క్షణాల్లోనే వైరల్ అయ్యింది. సోషల్ మీడియాతో పాటు అన్ని వేదికలపై ఇప్పుడు ఇదే ప్రోమో ట్రెండ్ అవుతుంది. నిర్మాత దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు వున్నాయి. ప్రేక్షకులకు నవ్వులు పంచడానికి మే 27న ఎఫ్ 3 ప్రపంచవ్యాప్తంగా భారీ విడుదల కానుంది.