Mar 26,2023 22:11

ఫొటో : మాట్లాడుతున్న అటవీశాఖ అధికారి టి.ఉమామహేశ్వర్‌

ఎర్రచందనం రక్షణపై అవగాహన
ప్రజాశక్తి-ఉదయగిరి : అటవీ సంరక్షణ ఎర్రచందనం రక్షణ, ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమంను కొత్తపల్లి బీట్‌లో నిర్వహించినట్లు అటవీశాఖ అధికారి టి.ఉమామహేశ్వర్‌ పేర్కొన్నారు. ఆదివారం మండల పరిధిలోని సెక్షన్‌ కొత్తపల్లి బీట్‌లోని అటవీ అంచు గ్రామమైన కొత్తపల్లిలో శిబిరంను నిర్వహించారు. నెల్లూరు రెయిన్‌బో సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌కు చెందిన ఆర్తోపెడిక్స్‌, గైనకాలజీ, గ్యాస్ట్రోఎంట్రాలజీ విభాగాల్లో నిపుణులు పాల్గొని 275 మంది వద్ధులు ఉచిత వైద్యను అందించినట్లు తెలిపారు. అందులో భాగంగా మల్టీవిటమిన్‌ సిరప్‌ మాత్రలు పంపిణీ ఉచితంగా అందజేస్తామన్నారు.
అనంతరం ఎర్రచందనం రక్షణ, అగ్ని ప్రమాదాల నుంచి అటవీ సంరక్షణ, వన్యప్రాణుల సంరక్షణ తదితర అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పించారు. ఎన్‌బిఎ, ఎబిఎస్‌, ఆర్‌ఎస్‌ ప్రొటెక్షన్‌ స్కీమ్‌ వైద్యుల ఆధ్వర్యంలో ఈ ఉచిత వైద్య శిబిరంతో ఈ అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నారు. కార్యక్రమంలో డాక్టర్‌ వివేక్‌, డాక్టర్‌ అనిల్‌, డాక్టర్‌ శైలజ, డిఆర్‌ఒ శ్రీనివాసులు, ఎఫ్‌బిఒలు అశోక్‌ విజయకుమార్‌, లక్ష్మి ప్రస్సన్న, జే కే వి ప్రసాద్‌, గ్రామస్తులు పాల్గొన్నారు.