
ప్రజాశక్తి - అద్దంకి
స్థానిక ఆర్టీసీ బస్టాండు ఆవరణలో ఎస్‌డబ్ల్యూఎఫ్ జెండా ఆవిష్కరణ మంగళవారం చేశారు. ఎస్‌డబ్ల్యూఎఫ్ అధ్యక్షుడు గంగాధర్ అధ్యక్షతన 45వ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు. డిపో కార్యదర్శి డిఎవి సుబ్బారావు జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భముగా ఎస్‌డబ్ల్యూఎఫ్ ఆవిర్భం ఏ పరిస్థితిలో జరింగిందో, దాని ప్రాముఖ్యత గురించి వివరించారు. ఐక్య ఉధ్యమాల నినాదంతో ఎస్‌డబ్ల్యూఎఫ్ ఆవిర్భావం జరిగినట్లు చెప్పారు. అన్ని యూనియన్స్ ఆ నినాదం ఎత్తుకున్నారని తెలిపారు. కార్యక్రమంలో డిపోలోని సమస్యలపై అధ్యక్షుడు గంగాధర్ మాట్లాడారు. డిపో అధికారులు పద్దతులు మార్చుకొని డిపో అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. కార్మికులపై వేధింపులు ఆపాలని కోరారు. బాపట్ల జిల్లా కార్యదర్శి తిరుపతిరెడ్డి మాట్లాడుతూ కెఎంపిఎల్ కోసం అధికారులు డ్రైవర్స్ పై వేధింపులు ఆపాలని హెచ్చరించారు. చివరికి ఎస్‌డిఐ కూడా బెదిరించడం దారుణమన్నారు . ఈ బెదిరింపులు మానుకొని సంస్థ అభివృద్ధికి పాటు పడాలని చెప్పారు. జిఓ70, 71ని రద్దుచేయాలన్నారు. క్యాడర్ స్ట్రెంగ్త్ పేరుతో కార్మికులను ఇబ్బంది పెడుతున్నారని అన్నారు. దానిని రద్దు చేసి యదా విధిగా కార్మికులను ఎక్కడి వారిని అక్కడే ఉంచి వచ్చిన ఇబ్బందిని తొలగించాలని కోరారు. కార్యక్రమంలో ప్రకాశం జిల్లా కార్యదర్శి పి శ్రీనివాసరావు, వి శ్రీనివాసరావు, ఎస్‌కె బీబీజాన్, కె కామేశ్వరరావు, వై రత్నకుమార్, బిసిహెచ్ శేఖర్, పూనాటి రామారావు పాల్గొన్నారు.