
ప్రజాశక్తి-కంచికచర్ల
ఈ నెల 13 నుండి 16 వరకు తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్లోని ఉస్మానియా విశ్వ విద్యాలయంలో జరుగుతున్న ఎస్ఎఫ్ఐ 17వ అఖిల భారత మహాసభలు జయప్రదం చేయలని ఎస్ఎఫ్ఐ ఎన్టీఆర్ జిల్లా అద్యక్షులు ఎం సోమేశ్వర రావు పిలుపునిచ్చారు. మహాసభలు విజయం కోరుతూ స్థానిక శ్రీ అక్షర జూనియర్ కాలేజీ , కరస్పాండెంట్ కాసరగడ్డ రామారావుతో కలిసి బుధవారం వాల్ పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఎం.సోమేశ్వరరావు మాట్లాడుతూ దేశంలో విద్యారంగ ఎదుర్కొంటున్న అనేక సవాళ్ళపై అనేక తీర్మానాలు చేసి భవిష్యత్తు పోరాటాలు రూపకల్పన చస్తారన్నారు.. నరేంద్ర మోడీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చాక జాతీయ విద్యా విధానం పేరుతో మొత్తం విద్య వ్యవస్థను ప్రైవేటీకరణ, కార్పొరేటికరణ, కాషాయీకరణ చేస్తుందన్నారు. రాష్ట్రంలో సీఎం జగన్ ప్రతిఏటా జాబ్ క్యాలండర్ విడుదల చేశాను అని చెప్పి ఇంతవరకు విడుదల చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కూళ్లలో 25 వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయలేదన్నారు. అలాగే జీవో నెం 77తో విద్యార్థులకు వసతి దీవెన అందడంలేదదని ఆరోపించారు. రాష్ట్రంలో నాడు-నేడు పేరుతో పాఠశాలలకు లక్షల నిధులు కేటాయించినా పూర్తి స్థాయిలో పనులు పూర్తి కాలేదన్నారు. 3,4,5 తరగతుల విలీనం పేరుతో అదే పాఠశాలలను మూత వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నందిగామ డివిజన్ కార్యదర్శి జి.గోపినాయక్, ఎస్ఎఫ్ఐ కంచికచర్ల మండల కార్యదర్శి ఎస్.కె బాషా, జిల్లా సహాయ కార్యదర్శి ఎస్.కె.జాహిదా పాల్గొన్నారు.