
మంగళగిరి (గుంటూరు) : ఎస్ఎఫ్ఐ మంగళగిరి డివిజన్ నాయకులు ఎం.బాలాజీని మంగళగిరి పట్టణ పోలీసులు శుక్రవారం రాత్రి అక్రమంగా అరెస్టు చేసి పట్టణ పోలీస్ స్టేషన్కు తరలించారు. సిపిఎం సీనియర్ నాయకులు జెవి.రాఘవులు మీడియాతో మాట్లాడుతూ ... ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఎలాంటి ఆందోళనా కార్యక్రమాలు లేనప్పటికీ ఎస్ఎఫ్ఐ నాయకులను పోలీసులు వేధింపులకు గురి చేస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. డిగ్రీ పరీక్షలు జరుగుతున్న సమయంలో బాలాజీని తీసుకొచ్చి స్టేషన్ లో పెట్టారనీ, ఈ విధంగా అక్రమంగా అరెస్టు చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. అరెస్టయిన బాలాజీని పోలీస్ స్టేషన్లో జెవి రాఘవులు, సిపిఎం పట్టణ కార్యదర్శి వై కమలాకర్ పరామర్శించారు.