Feb 06,2023 20:27

పోస్టర్‌ ఆవిష్కరిస్తున్న ఎస్‌ఎఫ్‌ఐ, యుటిఎఫ్‌ నాయకులు

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : 10వ తరగతి విద్యార్థులకు ఈనెల 26న నిర్వహించే ప్రజ్ఞావికాస పరీక్షను జయప్రదం చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు సిహెచ్‌.వెంకటేష్‌, యుటిఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి జెఎవిఆర్‌కె ఈశ్వరరావు పిలుపునిచ్చారు. సోమవారం స్థానిక ఎల్‌బిజి భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ విద్యారంగంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తూ, విద్యార్థులు, ఉపాధ్యాయుల సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తున్న ఎస్‌ఎఫ్‌ఐ, యుటిఎఫ్‌ విద్యారంగం అభివృద్ధి కోసం పోరాటాలు చేయడమే కాకుండా విద్యార్థులను విద్యలో ప్రోత్సహించేందుకు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయని తెలిపారు. 10వ తరగతి విద్యార్థులను ప్రోత్సహించేందుకు నిర్వహించే ఈ ప్రజ్ఞా వికాస పరీక్ష పేపర్‌ ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు పర్యవేక్షణలో తయారు చేశారని తెలిపారు. ఈ పరీక్ష జిల్లాల్లో అన్ని మండల కేంద్రాల్లో 26వ తేదీన ఉదయం 10 గంటలకు జరుగుతుందని, ఎంట్రీ ఫీజు రూ.25 అని తెలిపారు. మొదటి బహుమతి రూ.5000, రెండవ బహుమతి రూ.3000, మూడో బహుమతి రూ.2000 ఉంటుందని తెలిపారు. మండల స్థాయి విజేతలకు మొమెంటోస్‌, సర్టిఫికేట్‌లు అందజేస్తామని తెలిపారు. పరీక్షల వివరాల కోసం
విజయనగరం టౌన్‌ - 77998 13327, 7589290549
నెల్లిమర్ల-7288849236.63010 07969,
ఎస్‌.కోట - 7995107340.94924 14763,
గణపతినగరం - 8341105362,760103413,
చీపురుపల్లి -99058 25957.70384 98735,
రాజాం-77290 57149,63029 78953,
బొబ్బిలి- 7013378783, 9642688591,
విజయ నగరం రూరల్‌ - 728800 25790,91331 12254
నంబర్లను సంప్రదించాలని తెలిపారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా సహాయ కార్యదర్శులు సిహెచ్‌.రామకృష్ణ, ఎం.హర్ష పాల్గొన్నారు.