Feb 06,2023 23:26

కలెక్టర్‌కు సమస్యను విన్నవిస్తున్న సిఐటియు నేత రాము

ప్రజాశక్తి-అచ్యుతాపురం
ఎస్‌ఈజెడ్‌లోని పరిశ్రమలలో భద్రతా ప్రమాణాలు చేపట్టని యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఆర్‌ రాము, కోశాధికారి వివి.శ్రీనివాసరావు సోమవారం అనకాపల్లి జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫార్మా పరిశ్రమలలో ప్రమాదాల నివారణకు యాజమాన్యాలు ఎటువంటి ముందు జాగ్రత్తలు పాటించడం లేదన్నారు. యాజమాన్యాల నిర్లక్ష్యం కారణంగా తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని తెలిపారు. ఉపాధి కోసం దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చిన కార్మికులు ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పరిశ్రమల ప్రమాదాలపై సేఫ్టీ ఆడిట్‌ నిర్వహించాలని, అందులో వచ్చిన లోపాలపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఫ్యాక్టరీ ఇన్‌స్పెక్టర్‌ నిరంతరం తనిఖీలు చేపట్టి పరిశ్రమల భద్రత ప్రమాణాలు పాటించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఇటీవల జిఎంఎఫ్‌సి ఫార్మా పరిశ్రమలో జరిగిన ప్రమాదంపై విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.