May 15,2022 01:16
బాపట్ల ఎస్పీ వకుల్‌ జిందాల్‌తో ఆళ్ళముడి ప్రభాకర్‌

ప్రజాశక్తి-కొల్లూరు
బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ను ఎస్‌పీ కార్యాలయంలో శనివారం అంబేడ్కర్‌ ఛారిటబుల్‌ ట్రస్ట్‌ చైర్మన్‌ ఆళ్లమూడి ప్రభాకర్‌ మర్యాద పూర్వకంగా కలిశారు. కొత్త జిల్లాలో యాక్టివ్‌గా శాంతి భధ్రతల పరిరక్షణకు అయన తీసుకుంటున్న చర్యలను అభినందించారు. తమ ట్రస్టు ద్వారా పేద విద్యార్థుల కు చేస్తున్న సహాయ సహకారాలను ఎస్పీకి వివరించారు. పేద విద్యార్థులకు చేస్తున్న సేవకు ట్రస్టు వారిని ఎస్పీ అభినందిం చారు. ఇలాంటి సేవలు మరిన్ని చేయాలని తెలిపారు.