Jul 03,2022 22:22

కాలనీవాసులతో మాట్లాడుతున్న ఇఎస్‌ వెంకటేష్‌

ప్రజాశక్తి. పుట్టపర్తి అర్బన్‌ : నగర పంచాయతీ పరిధిలోని కర్నాటక నాగేపల్లి ఎస్టీకాలనీలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని సిపిఎం నాయకులు డిమాండ్‌ చేశారు. ఇంటింటికి సిపిఎం కార్యక్రమంలో భాగంగా సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఇ ఎస్‌ వెంకటేష్‌, బ్యాళ్ల అంజి తదితరులు ఆదివారం ఎస్టీకాలనీలో పర్యటించి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ తమ కాలనీకి వారానికి ఒకసారి కూడా నీరు సరఫరా చేయడం లేదన్నారు. నీళ్ల ట్యాంకు ఉండి కూడా ప్రయోజనం లేదన్నారు. పారిశుధ్యం పడకేసిందన్నారు. రహదారులు అధ్వానంగా ఉన్నాయన్నారు. గుంతలు మయం ఉన్న రహదారులలో పిల్లలు, వద్ధులు అవస్థలు పడుతున్నారని నాయకుల దృష్టికి తెచ్చారు. కాలనీ సమస్యలపై ఈనెల 5 న సచివాలయం వద్ద ధర్నా చేపడతామని కాలనీవాసులు పాల్గొని విజయవంతం చేయాలని సిపిఎం నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు తిరుపాలు, సుబ్బి, వెంకటయ్య, వెంకటేశు, పార్వతి, వెంకటమ్మ తదితరులు పాల్గొన్నారు.