Mar 19,2023 19:47

అధికంగా వచ్చిన కరెంటు బిల్లులును చూపిస్తున్న గ్రామస్తులు

బాడంగి : మండలంలోని ఎరుకలపాకల గ్రామంలో ఎస్‌టిలకు కరెంటు బిల్లులు ఇస్తున్నారని గజరాయనివలస ఎంపిటిసి పాలవలస గౌరు అన్నారు. ఈ సందర్బంగా ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎస్‌టిలకు 200 యూనిట్ల వరకు కరెంటు ఉచితమని ప్రభుత్వం చెప్పినప్పటికీ అధికారులు బిల్లులు ఇవ్వడమేంటని ప్రశ్నించారు. 100 యూనిట్లు వాడినా అధిక బిల్లులు వేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు.