Oct 13,2021 16:09

భువనేశ్వర్‌: ఆంధ్రా ఒరిస్సా సరిహద్దు(ఏవోబి)లో మావోయిస్టులకు, భద్రతా దళాలకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు మావోయిస్టులు చనిపోయినట్లు ఒడిషా డిజిపి అభరు తెలిపారు. చనిపోయిన వారిలో ఏరియా కార్యదర్శి అనిల్‌ తోపాటు మావోయిస్టు ప్రముఖ నాయకురాలు అరుణక్క అంగరక్షకుడు ఉన్నారు. మావోయిస్టులు లంగిపోతే పునరావాసం కల్పిస్తామని డిజిపి అభరు చెప్పారు. ఎన్‌కౌంటర్‌ జరిగిన స్థలంలో రెండు రైఫిళ్లు, ఆరు మ్యాగజైన్లు, 59 తూటాలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.