Oct 03,2022 22:31
  • ఏకపక్ష నిర్ణయంపై ఉపాధ్యాయ సంఘాల ఆగ్రహం

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : పరీక్షల విధానంలో పాఠశాల విద్యాశాఖ మార్పులు చేసింది. ఇప్పటి వరకుఉను ఫార్మెటీవ్‌ అసెస్‌మెంట్‌ (ఎఫ్‌ఎ)(నిర్మాణత్మక మూల్యాంకనం) విధానాన్ని రద్దు చేసి తరగతి గది ఆధారిత మూల్యాంకనం(సిబిఎ) విధానాన్ని తీసుకొచ్చింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను ఎస్‌సిఇఆర్‌టి డైరెక్టర్‌ బి ప్రతాప్‌ రెడ్డి సోమవారం విడుదల చేశారు. అయితే కొత్త విధానంలో పరీక్షలు ఉంటాయో వెల్లడించలేదు. కనీసం ఉపాధ్యాయ సంఘాలతో చర్చించకుండానే విద్యాసంవత్సరం మధ్యలో విద్యాశాఖ ఈ విధానాన్ని తీసుకొచ్చింది. దీంతో సిబిఎ విధానంలో పరీక్షలు ఎలా ఉంటాయోనని విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తునాురు. సపోర్టింగ్‌ ఆంధ్రాస్‌ లరిుంగ్‌ ట్రాన్సఫార్మెషన్‌ ప్రోగ్రాం(సాల్ట్‌) పేరిట ప్రపంచ బ్యాంకుతో రాష్ట్రప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా దీనిని అమలు చేస్తున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది. ఈ విద్యాసంవత్సరం నుంచి పదో పరీక్షలను 6 పేపర్లకు రాష్ట్రప్రభుత్వం కుదించిందని, అందుకు తగ్గట్టుగా అంతర్గత మూల్యాంకనంలో మార్పులు తీసుకొస్తున్నట్లు పేర్కొంది. నవంబర్‌ 2 నుంచి 5వ తేది వరకు 1 నుంచి 8వ తరగతి విద్యార్థులకుఈ విధానంలో పరీక్షలు జరగనునాుయి. 9,10వ తరగతి విద్యార్ధులకుఫార్మెటీవ్‌ అసెస్‌మెంట్‌ విధానంలోనే యధాతధంగా పరీక్షలు ఉంటాయి. ఎఫ్‌ఎ-1కు బదులు సిబిఎ-1, ఎఫ్‌ఎ-3 స్థానంలో సిబిఎ-2, సమ్మెటీవ్‌ అసెస్‌మెంట్‌(ఎస్‌ఎ-3)కు బదులు సిబిఎ-3 విధానంలో పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొంది. ఎఫ్‌ఎ-2, ఎఫ్‌ఎ-4, ఎస్‌ఎ-1 పరీక్షలు ఉంటాయో లేదో వెల్లడించలేదు.
విద్యారంగ సంస్కరణలో భాగంగా పరీక్షా విధానంలో రాష్ట్రప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం సరికాదని ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. చర్చించకుండానే పరీక్ష విధానంలో మార్పులా చేస్తారా అని యుటిఎఫ్‌ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎన్‌ వెంకటేశ్వర్లు, కెఎస్‌ఎస్‌ ప్రసాద్‌ ఒక ప్రకటనలో ప్రశిుంచారు. ఇప్పుడును విధానంలో ఏం లోపం ఉందో, భవిష్యత్తులో ప్రవేశపెట్టబోయే విధానంలో విద్యార్థులకుఏ లాభం కలుగుతుందో ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలనికోరారు. కనీసం ఉపాధ్యాయ సంఘాలతో చర్చించుకుని సమగ్ర విధానానిు రూపొందించాల్సిన పద్ధతి లేకుండా పోవడం సరైంది కాదని పేర్కొన్నారు. ఏడాది కొక్కసారి పరీక్షల విధానంలో మార్పులు చేయటం వల్ల విద్యార్థులు నష్టపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. పరీక్షల్లో తీసుకును మార్పులపై ఉపాధ్యాయ సంఘాలతో చర్చించాలని కోరారు. సంస్కరణలు ఏకపక్షంగా అమలు చేయటం తగదని ఎస్‌టియు అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సాయి శ్రీనివాస్‌, హెచ్‌ తిమ్మను మరో ప్రకటనలో అభ్యంతరం వ్యక్తం చేశారు. పరీక్షల సంస్కరణల పేరుతో విద్యాసంవత్సరం మధ్యలో వివిధ తరగతులకు రకరకాల పేర్లను మార్చడం వల్ల విద్యార్థులు, ఉపాధ్యాయులు గందరగోళ పరిస్థితులను ఎదుర్కొవాల్సి వస్తోందని ఎపిటిఎఫ్‌ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జి హృదయరాజు, ఎస్‌ చిరంజీవులు మరో ప్రకటనలో పేర్కొన్నారు.