Jul 28,2021 20:21

హైదరాబాద్‌ : ప్రముఖ ప్రయివేటు టెలికం కంపెనీ భారతీ ఎయిర్‌టెల్‌ తన ప్రీపెయిడ్‌ ప్లాన్‌ ధరలను సవరించినట్లు ప్రకటించింది. ప్రాథమిక స్థాయి ప్లాన్‌ ధరను దాదాపు 60 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. బేసిక్‌ ప్లాన్‌ రూ.49 ప్రీపెయిడ్‌ రీఛార్జ్‌ను నిలిపివేసినట్లు పేర్కొంది. ఇకపై కంపెనీ ప్రాథమిక ప్రీపెయిడ్‌ ప్యాక్స్‌ రూ.79 స్మార్ట్‌ రీఛార్జ్‌ నుంచి ప్రారంభమవుతాయని తెలిపింది. ఈ ప్లాన్‌లో రూ.64 టాక్‌ టైమ్‌, 200 ఎంబి డేటా, 28 రోజుల గడువు అందిస్తున్నట్లు పేర్కొంది.