Aug 18,2022 21:42
  • అసెంబ్లీలో ప్రతిపక్ష నేత అజిత్‌ పవార్‌

ముంబయి : మహారాష్ట్రలో వరదల కారణంగా గత 45 రోజుల్లో 137 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని శాసనసభలో ప్రతిపక్ష నేత అజిత్‌ పవార్‌ ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ప్రత్యేకించి కొంకణ్‌ ప్రాంతమంతటా భారీ వర్షాల కారణంగా వరదలు ముంచెత్తడంతో అనుదాతలు తీవ్ర ఇక్కట్లను ఎదుర్కొంటున్నారని, అప్పులు తీర్చేమార్గం లేకపోవడంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆయన తెలిపారు. శాసనసభ సమావేశాల్లో గురువారం ఆయన మాట్లాడుతూ 'రతుగిరి, రాయిగడ్‌, గడ్చిరోలి, చిప్లూన్‌, ప్రత్యేకించి కొంకణ్‌ ప్రాంతమంతా వరద ప్రభావానికి గురైంది. రాష్ట్రంపై గ్లోబల్‌ వార్మింగ్‌ ప్రభావం తీవ్రంగా ఉంది. నదులన్నీ పొంగిపొర్లుతున్నాయి. రైతులు చనిపోతునాురు. 45 రోజుల్లో 137 మంది అనుదాతలు ఆత్మహత్యకు పాల్పడ్డారు.' అని ఆయన అన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే, ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడువీస్‌ వరద ప్రభావిత ప్రాంతాల్లో సర్వే చేపట్టి బాధిత రైతాంగాన్ని తక్షణమే ఆదుకోవాలనిఆయన డిమాండ్‌ చేశారు. ఆత్మహత్యకు పాల్పడిన రైతులందరికీ ఎక్స్‌గ్రేషియా అందజేసి వారి కుటుంబాలను అనిు విధాలా ఆదుకోవాలని కోరారు.