బలపాలు తెచ్చిన చేటు

Apr 25,2024 04:36 #jeevana

కోనాపూర్‌ అనే ఊళ్లో కనకవ్వ, లక్ష్మణ్‌ దంపతులు ఉన్నారు. వాళ్ళకి రమ, రమ్య అనే ఇద్దరు కూతుర్లు. రమ ఎనిమిదోవ తరగతి, రమ్య తొమ్మిదో తరగతి చదువుతున్నారు. రమ్యకి చిన్నప్పటి నుండి ఒక అలవాటు ఉంది. బలపాలు బాగా తినేది. అమ్మ ఎంత నచ్చజెప్పినా ఆ అలవాటు మానుకోలేదు. పెద్దయినా అదే కొనసాగిస్తోంది. రమ కూడా అక్క రమ్య లాగా బలపాలు తినడం ప్రారంభించింది. పిల్లలిద్దరూ చెప్పిన మాట వినడం లేదని కనకవ్వ ఎంతో బాధపడింది.
ఒక రోజు రమ్య, పాఠశాలలో కళ్ళు తిరిగి పడిపోయింది. వాళ్ల అమ్మ నాన్న, తనని దవాఖానాకు తీసుకెళ్లారు. ‘బలపాలు తినడం వాళ్ల కడుపులో పురుగులు పట్టాయి. అందువల్ల మీ అమ్మాయికి ఆపరేషన్‌ చెయ్యాలి’ అని వైద్యుడు చెప్పాడు. రమ్యకి ఆపరేషన్‌ చేశారు. ఇదంతా చూసిన రమకి భయం పట్టుకుంది. ‘అమ్మో నేను కూడా అక్కలా బలపాలు తినడం మొదలుపెట్టాను. నాక్కూడా ఇలాగే జరుగుతుందేమో.. ఇక నుండి నేను ఈ అలవాటు ఎలాగైనా మానుకోవాలి’ అని మనసులో బలంగా అనుకుంది.
రమ్యకి జరిగిన ఆపరేషన్‌ గురించి, ఉపాధ్యాయులు స్కూల్లో పిల్లలందరికీ చెప్పారు. బలపాలు తినే అలవాటు వల్ల ఆరోగ్యం ఎలా పాడవుతుందో వివరించి చెప్పారు. రమతో పాటు విద్యార్థులందరూ ఆ మాటలను శ్రద్ధగా విన్నారు. ఆ రోజు నుండి వాళ్లకి ఉన్న చెడ్డ అలవాట్లను విద్యార్థులు మానుకుంటామని ప్రతిజ్ఞ చేశారు.

నీతి : బలపాలు తినడం ఆరోగ్యానికి హానికరం.
– పి.లిఖిత, 8వ తరగతి,
రాయిలాపూర్‌, మెదక్‌ జిల్లా.

➡️