మెప్పులు

Apr 11,2025 23:10 #Jeevana Stories

విత్తనాలు నాటాలోయ్
మొక్కలు మొలిపించాలోయ్
పెత్తనాలు మానాలోయ్
శ్రద్ధగ పనిచెయ్యాలోయ్

అంజనాలు నమ్మొద్దోయ్
మూఢనమ్మకాలొదులోయ్
కార్ఖానాలు పెంచాలోయ్
ఉపాధులను పొందాలోయ్

అనుమానాలు వదలాలోయ్
అసలు నిజం తేలాలోయ్
అభిమానాలు చూపాలోయ్
అందరి ప్రేమ పొందాలోయ్

భోజనాలు చెయ్యాలోయ్
పుష్టినెంతో పొందాలోయ్
విధానాలు నేర్చాలోయ్
విజ్ఞానం పొందాలోయ్

మంచి స్నేహం చెయ్యాలోయ్
సాయపడుతు ఉండాలోయ్
విమానాలు నడపాలోయ్
గగనంలో ఎగరాలోయ్

వందనాలు చెయ్యలోయ్
పెద్దలను గౌరవించాలోయ్
బహుమానాలు పొందాలోయ్
మెప్పులందుకోవాలోయ్!

– ఎన్‌.వి.ఆర్‌.సత్యనారాయణమూర్తి,
80745 26849.

➡️