బం బ: భలే భలే!

Jun 10,2024 05:12 #feachers, #Jeevana Stories, #kavithalu

బడికి వెళ్లే బంగారు
బాల బాలికలం
బిరుదులు పొందే పిల్లలుగా
బీజాలు వేస్తాం!

బుద్ధిశాలులమౌతాం
బూరెలు తిటాం
బెత్తం దెబ్బలు తినని
బేబీలుగా ఉంటాం !

బైట ఎన్నో ఆటలాడుతాం
బొజ్జ నిండా మెక్కుతాం
బోధించే గురువులను గౌరవిస్తాం
భౌ భౌ అంటూ కుక్కలు అరిచే
బండెక్కి ఎంచక్కా ఇళ్లకు చేరాం!

– బి. పాండురంగ,
83412 12132.

➡️