పిల్లలూ, జాగ్రత్త!

Apr 28,2025 02:37 #feachers, #jeevana

ఎండలు మండుతున్నాయి
వడగాల్పులు వీస్తున్నాయి
పిల్లలూ బయటికి రాకండి
వడదెబ్బకు గురి కాకండి

నీటి కుంటలో నీరేది?
బావులు, చెరువులో నీటి జాడేది?
పొలాలు బీడు వారాయి
మొక్కలు వాడిపోయాయి

పక్షులు/ జంతువులకు నీరు పెడదాము
మొక్కలకు నీరు పోద్దాము

ఫ్రిజ్‌ నీళ్లొద్దు
కూల్‌ డ్రింకులు మనకొద్దు
పిజ్జాలు బర్గర్లు అసలొద్దు
అనారోగ్యానికి గురి కావద్దు

నిమ్మకాయ నీళ్లు తాగుదాము
పుచ్చకాయ ముక్కలు తిందాము
కొబ్బరి నీళ్లు కావాలి
సబ్జా నీరు తాగాలి
ఎర్ర/ నల్ల కుండను కొందాము
చల్లని నీరు తాగుదాము
ఆరోగ్యంగా ఉందాము
అందరికీ ఇది చెబుదాము

– ఏడుకొండలు కళ్ళేపల్లి,
మచిలీపట్నం, 94908 32338.

➡️