భలే భలే పండ్లు

Apr 18,2025 02:57 #feachers, #fruits, #jeevana, #Kavitha

బత్తాయి పండు
బంతి వలె ఉండు
తీపి పులుపు వుండు
తింటే మంచి గుండు

సపోటా పండు
భలే స్వీటు గుండు
మధురమైన రుచి కలిగి
పసందైన పండు

ఆపిల్‌ పండు
ఎంతో బాగుండు
ఎరుపు రంగు ఉండి
తింటే కమ్మ గుండు

అరటి పండు
అందమైన పండు
పసుపు వర్ణం కలిగి
గుజ్జు గుజ్జు నుండు

మామిడి పండు
టెంకె లోపలుండు
బంగారు వన్నెతో
ఎండాకాలం ఉండు

అల్ల నేరేడు పండు
నల్ల నల్లగుండు
వంకాయ రంగులో
నిగ నిగ లాడుతుండు

ద్రాక్ష పండు
పులుపు తీపి వుండు
తింటా ఉంటే
భలే మంచి గుండు

జామ పండు
చూస్తే బాగుండు
తింటూ ఉంటే
ఎంతో కడుపు నిండు

– కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి,
94415 61655.

➡️