సీతాకోకచిలుక

May 14,2024 05:15 #jeevana

ఎవరు కట్టని కోక
ఎంతో చక్కటి సీతాకోకచిలుక
ఎగుర లేని పురుగు పుట్టుక
ఎగిరే అందమైన సీతాకోకచిలుక

కళ్ళు మూసి తెరిచినట్లు రెక్కలు
కోకలో రంగు రంగు చుక్కలు
పట్టబోతే ఆడిస్తాయి రెక్కలు
కదిలే రంగు మారని చుక్కలు

అందమైన సీతాకోక చిలుక రూపం
చూడడానికి ఎంతో అపురూపం
నీ పేరు మీద ఎన్నో సినిమాలు
రాశారు మనోహరమైన గీతాలు

రంగులు మార్చని సీతాకోకచిలుక
చెబుతుంది మనిషికి ఎరుక
గొంగళి పురుగు అంటే చీదరింపు
సీతాకోకచిలుక అంటే ఆదరింపు

గొంగళి పురుగు గూటిలో తపస్సు
మారిన సీతాకోకచిలుకగా యశస్సు
మనిషి నీలోని చెడును మార్చుకో
సీతాకోకచిలుక వలె పేరు తెచ్చుకో!

– పి.బక్కారెడ్డి,
97053 15250.

➡️