వేసవి కాలంలో వేడి, తేమ, ధూళి, కాలుష్యం వంటి సమస్యల వల్ల పిల్లల ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకుంటే పిల్లలను వేసవి కారకాల నుండి రక్షించుకోవచ్చు.
– ఈ కాలంలో పిల్లలకు చిరాకు పెట్టించే పాపులర్ పాలిస్టర్ బట్టలు కాకుండా, తేలికగా ఉండే కాటన్ దుస్తులను వేయడం మంచిది. ఇవి శరీరానికి తేమను కలిగించవు.
– ఒకవేళ పిల్లలు బయటకు వెళ్లే అవసరం వస్తే ఎండ, దోమలు, ఇతర కీటకాల నుంచి కాపాడేందుకు లోషన్స్ వాడాలి.
– వేసవిలో చెమట ఎక్కువగా రావడం వల్ల చర్మ సమస్యలు కనిపిస్తాయి. వీటిని నివారించేందుకు సహజమైన నేచురల్ రెమిడీస్, సన్‌స్క్రీన్ లోషన్‌లు, మాయిశ్చరైజర్‌లు ఉపయోగించాలి.
– సెలవుల్లో పిల్లలు ఎక్కువగా జంక్ ఫుడ్ తింటారు. ఇంకా కార్బొనేటెడ్ డ్రింక్స్ తీసుకుంటారు. ఇది గ్యాస్, కడుపునొప్పి, ఫుడ్ పాయిజనింగ్ వంటి సమస్యలకు దారితీస్తుంది. వీటిని నివారించేందుకు
శుభ్రమైన, ఇంట్లో తయారు చేసిన ఆహారాన్ని అందించాలి.
– బయట ఆడి ఇంటికి వచ్చిన వెంటనే చేతులు కడుక్కోవడం అలవాటు చేయాలి.
– ఆటల్లో మునిగిపోయే పిల్లలు ఎక్కువగా నీరు తాగడం మరిచిపోతారు. దీని వల్ల డీహైడ్రేషన్‌కి లోనవుతారు. కాబట్టి వారిని తరచూ నీరు తాగమని చెప్పాలి. అలాగే పండ్ల రసాలు, నారింజ జ్యూస్ వంటి హైడ్రేటింగ్ పానీయాలు ఇవ్వాలి.
– సెలవుల్లో పిల్లలు స్నాక్స్‌కు అలవాటు పడిపోతారు. దీంతో వారి ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది. అందుకే తాజా పండ్లు, డ్రై ఫ్రూట్స్, ఫ్రూట్ సలాడ్స్ వంటి ఆరోగ్యకరమైన ఆహారాలను ఇంట్లోనే తయారుచేసి ఇవ్వాలి.
– వేసవి తాపం తీవ్రమవుతున్న నేపథ్యంలో మధ్యాహ్న సమయంలో పిల్లలను బయటకు పంపకుండా చూడాలి. అవసరమైతే మాత్రమే, అది కూడా ఉదయం లేదా సాయంత్రం చల్లగా ఉన్న సమయంలోనే బయటకు పంపాలి.
– సూర్యుని నుండి వచ్చే ప్రమాదకర కిరణాలు, గాలిలో కలిసిన కాలుష్య కారణాలు పిల్లలకు అనేక అనారోగ్య సమస్యలకు దారితీయవచ్చు. వీటిని నివారించేందుకు ఇంటిలో శుభ్రత పాటించాలి, అవసరమైతే మాస్కులు వాడించాలి.