సాధారణంగా కొబ్బరి నీరు ఆరోగ్యానికి చాలా మంచిదని అందరికీ తెలుసు. పోషకాలు సమృద్ధిగా ఉన్న ఈ నీళ్లు తాగడం వల్ల శరీరం హైడ్రేట్‌గా ఉంటుంది. కొబ్బరి నీళ్లలో ఎలక్ట్రోలైట్స్, హైడ్రేషన్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. అయితే.. చలికాలంలో కొబ్బరినీళ్లు తాగడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని కొందరు అనుకుంటారు. కానీ ఎలాంటి ఇబ్బందులు ఉండవని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
కొబ్బరి నీటి ప్రయోజనాలు : చలికాలంలో కొబ్బరి నీళ్ల తక్కువగా తాగుతుంటారు. అయితే చలికాలంలో కూడా శరీరానికి హైడ్రేషన్ అందించడానికి కొబ్బరి నీరు చాలా ఉపయోగపడుతుంది. దీంతో చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. అంతేకాకుండా.. చలికాలంలో వచ్చే చర్మం పగుళ్లు, జలుబు, దగ్గు వంటి సమస్యలు దూరం చేస్తుంది.
జీర్ణక్రియకు మంచిది : కొబ్బరి నీళ్లతో అనేక ఆరోగ్య సమస్యలు దూరమవుతాయి. కొబ్బరి నీరు జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది. ఎసిడిటీ, కడుపునొప్పి, కడుపు ఉబ్బరం వంటి సమస్యలను నివారిస్తుంది. చలికాలంలో కొబ్బరినీళ్లు తాగడం వల్ల రక్తపోటు, గుండె సంబంధిత సమస్యలు అదుపులో ఉంటాయి.
శరీరాన్ని శుద్ధి చేస్తుంది : కొబ్బరి నీళ్లలో ఉండే మెగ్నీషియం, ఎంజైమ్‌లు శరీరంలోని విష పదార్థాలను తొలగించి శరీరాన్ని శుద్ధి చేస్తాయి. అయితే, చలికాలంలో చాలా మంది పొడి, గరుకుగా ఉండే చర్మ సమస్యను ఎదుర్కొంటారు. కొబ్బరి నీరు తాగడం వల్ల ఈ సమస్య నుండి దూరంకావచ్చు.
రోగనిరోధక శక్తి పెరుగుతుంది : చలికాలంలో కొబ్బరినీళ్లు తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దీంతో జలుబు, దగ్గు వంటి సమస్యలు దూరమవుతాయి. చలికాలంలో కొబ్బరినీళ్లు తాగడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుందని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.