పిల్లల్లారా, రారండి!

Jun 12,2024 05:02 #jeevana

వేసవి సెలవులు
ముగిశాయని కుశాలగా
తనువెల్లా నోరు చేసుకొని
ప్రేమగా బడి పిలుస్తున్నది
పిల్లలూ పరుగున రారండి!
కనురెప్పలు వేయక
మీ రాక కోసం
బడి ఎదురు చూస్తున్నది
ఉత్సాహంతో రారండి
మీ ప్రార్థనాగీతం కోసం
సమావేశమందిరం తపిస్తున్నది
ఉరకలేస్తూ రారండి
మీ అడుగుల సవ్వడికి
ఆటస్థలం ఆత్రుతతో వుంది
ఆనందంగా రారండి
మీ చేతి స్పర్శకు కొత్త పుస్తకాలు
తహతహలాడుతున్నాయి
తొందరగా రారండి
మీ గుండె చప్పుళ్ళకు
గ్రంథాలయం నిశ్శబ్దంగా
నిరీక్షిస్తున్నది
వడివడిగా రారండి
అమ్మనాన్నలా ఆదరించి
పాఠాలు చెప్పడానికి
గురువులు స్వాగతిస్తున్నారు
విద్యార్థుల్లారా, విచ్చేయండి!

– సురేంద్ర రొడ్డ
94915 23570

➡️