వయసు మీద పడేకొద్దీ శరీరంలోని అవయవాల పనితీరులోనూ మార్పులు వస్తుంటాయి. అందులో ప్రధానమైంది, జీర్ణవ్యవస్థ. ఈ వయసులో సులువుగా అరుగుతూ.. శరీరానికి తగిన శక్తిని ఇచ్చే ఆహారాన్ని తీసుకోవాలి.
- వయసు మీదపడిన వారిలో ఎదురయ్యే సమస్య ఎముకలు గుళ్లగా మారడం. దీనిని అధిగమించాలంటే.. తక్కువ కొవ్వు పదార్థాలు, ఆకు కూరలు, విటమిన్ బీ12, పీచు, క్యాల్షియం, పొటాషియం వంటి ప్రత్యేకమైన పోషకాల్ని రోజూ ఆహారంలో జత చేసుకోవాలి.
- రోగనిరోధక శక్తి తగ్గకుండా ఉండాలంటే, సీజనల్ పండ్లు, కూరగాయల్ని తప్పక తీసుకోవాలి. తినలేనివారు.. జ్యూస్ రూపాల్లోనైనా తీసుకోవాలి.
- పెద్దవారు సాధ్యమైనంత వరకు నూనె పదార్థాలు, వేపుళ్లు తీసుకోకపోవడమే శ్రేయస్కరం. ముఖ్యంగా నెయ్యి, డాల్డా, పొద్దు తిరుగుడు నూనె వంటివి మితంగా తీసుకుంటే ఆరోగ్యానికి మేలు.
- బిపి, షుగర్ వంటి ఇతర ఆరోగ్య సమస్యలున్నవారు.. రాగిజావ క్రమం తప్పకుండా తాగాలి. మధ్యాహ్నం ముడి బియ్యం అన్నం, కూరగాయలు తీసుకుంటే మంచిది. రాత్రులు తేలికపాటి అల్పాహారాన్ని తీసుకోవాలి.
- ఆహార నియమాలతోపాటుగా.. చిన్నపాటి దూరం వాకింగ్ చేయాలి. ఆసక్తి ఉన్న అభిరుచిని ఆస్వాదిస్తూ.. తగినంత విశ్రాంతిని తీసుకోవాలి.