చేప రైలు

Jan 10,2025 03:12 #chinnari, #jeevana, #Kavitha

అవి పట్టాలు కావు
ఆ ట్రాక్‌ నీలి సముద్రమే
ఆ సముద్రంలో
అచ్చం చేపలెక్కనే రైలు
ఈదుకుంటూ పోతుంది

దాని కళ్ళు అల్లంత
కోసు దూరం చూస్తయి
ముందు ఎర్రలైటు కనిపిస్తే
జాగ్రత్త పడుతుంది
దాని అరుపు
ఆమడ దూరం వినిపిస్తది

పచ్చలైటు కనిపిస్తే
ఉరుకుడే ఉరుకుడు
ఎవరు అడ్డు పడినా ఆగదు
పచ్చలైటే దాని మాస్టారు

దాని పొట్టలో అన్నీ పెట్టెలే!
ఆ పెట్టెల్లో ఎక్కిన వాళ్లను
దిగేవరకు
తన పిల్లలల్లే చూసుకుంటది
నీళ్ళు పాలు చారు పానీయాలు
అన్నం పెట్టి ఆకలి తీరుస్తది

పట్టాలపై ఆ చేప ఎంత
మేలు చేస్తుందో చెప్పలేం!
అది లేకుంటే
మన బతుకులు ఎట్లుండెనో!
చేప (రైలు)
నీకు చాలా ధన్యవాదాలు!

– పి.బక్కారెడ్డి,
97053 15250.

➡️