ఈగల బెడద ఇలా వదిలించుకోండి..

Jun 24,2024 19:01 #jeevana, #rainy season

వర్షకాలంలో ఇంట్లో ఈగల బెడద ఎక్కువగా ఉంటుంది. వంటగదిలో, బాత్‌రూమ్‌లో, ఇంటి ఆవరణలో ఎక్కడ చూసినా అవే కనిపిస్తాయి. వీటి కారణంగా అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనాల్సి వస్తుంది. వీటిని నివారించడానికి ఇంట్లోనే కొన్ని చిట్కాలు పాటిస్తే సరి.
ఒక నిమ్మకాయ, రెండు టీస్పూన్ల ఉప్పు, ఒక గ్లాసు నీరు తీసుకోవాలి. నిమ్మకాయను కోసి గ్లాసు నీళ్లలో వేసి ఉప్పు వేయాలి. ఈ రెండింటిని బాగా కలపాలి. స్ప్రే బాటిల్‌లో ఈ ద్రావణాన్ని పోసి ఈగలు ఎక్కడ చూసినా వాటిపై పిచికారీ చేయాలి.
ఆపిల్‌ సైడర్‌ వెనిగర్‌ ఇంట్లో నుండి ఈగలు రాకుండా చేయడంలో చాలా ప్రభావవంతంగా ఉంటుంది. ఆపిల్‌ సైడర్‌ వెనిగర్‌లో నీటిని బాగా కలపండి. తర్వాత ఈ మిశ్రమాన్ని స్ప్రే బాటిల్‌లో నింపి ఇల్లంతా స్ప్రే చేయాలి. ఇలా చేస్తే ఈగలు త్వరగా వెళ్లిపోతాయి.
కర్పూరం ద్వారా కూడా ఈగలను వదిలించుకోవచ్చు. కర్పూరం చిన్న ముక్క తీసుకోవాలి. ఒక చెంచా మీద ఉంచి, వెలిగించాలి. ఈ కర్పూరపు పొగను ఇల్లంతా వ్యాపించేలా చేయాలి. కర్పూరం పొగ ఇంట్లో ఈగలు త్వరగా పోయేలా చేస్తుంది. కర్పూరం వాసన ఉన్నంత సేపు ఒక్క ఈగ కూడా ఇంట్లోకి రాదు.
ఇంటిని శుభ్రపరిచేటప్పుడు కొన్ని విషయాలను దృష్టిలో ఉంచుకుంటే చాలా వరకు ఈగలను వదిలించుకోవచ్చు. ఇంటిని శుభ్రం చేసేటపుడు నీటిలో కొద్దిగా ఫినైల్‌ కలిపితే ఈగలు సులభంగా తొలగిపోతాయి.

➡️