కలసి మెలసి …

May 15,2024 03:07 #chinnari, #jeevana, #katha

రవి, లాస్య ఇద్దరూ అన్నాచెల్లెళ్లు. ఎప్పుడూ నేను గొప్ప అంటే, నేను గొప్ప అని కొట్టుకుంటూ ఉండేవారు. ‘నేను పెద్దవాడిని నేనే గొప్ప’ అనేవాడు రవి. ‘నాకు తెలివితేటలు ఉన్నాయి. నేనే గొప్ప’ అని లాస్య వాదులు ఆడుకునేవారు. తండ్రి ఎన్నోసార్లు నచ్చజెప్పాలని చూసినా, వినేవారు కాదు. పిల్లలకి అర్థమయ్యేలా చెప్పాలని ఆయన ఎంతో ఆలోచించాడు.
ఒక రోజు పిల్లలు బయట ఆడుకుంటూ ఉంటే, ఒక కోతి చెట్టుపై కాయలు తింటూ ఉంది. చెల్లిని ఏడిపించాలని చూసిన రవి, ఆ కోతిని లాస్య మీదకి ఉసికొల్పాలని చూశాడు. అయితే ఆ కోతి లాస్య వెంటే కాకుండా, పక్కనే ఉన్న రవి వెంట కూడా పడింది. ఊహించని ఈ పరిణామంతో రవి బిక్కచచ్చిపోయాడు. కోతి వెంటాడుతుంటే భయపడిపోయిన లాస్య, రవితో పరుగెత్తలేక కిందపడిపోయింది. ఆ కోతి అమాంతం లాస్య మీద పడబోయింది. అయితే ‘చెల్లిని ఎక్కడ రక్కేస్తుందో అని భయపడ్డ రవి, వెనక్కి తిరిగి, కిందపడిన లాస్య చెయ్యి పట్టుకుని తండ్రి వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్లాడు. అప్పుడు వాళ్ళ నాన్న ఆ కోతిని తరిమేశారు. ‘మీ ఇద్దరూ కలిసి మెలిసి ఉంటే ఎంతటి కష్టాన్నయినా అధిగమించగలరు. చూశారా, ఇప్పుడు ఎలా తప్పించుకున్నారో?’ అని వాళ్లకి అర్థమయ్యేలా చెప్పారు. ఆ రోజు నుండి రవి, లాస్య ఇద్దరూ కలిసి మెలిసి ఉన్నారు.

– సిహెచ్‌. దీపు కార్తికేయ,
6వ తరగతి, అరవింద మోడల్‌ స్కూలు, మంగళగిరి.

➡️