దానిమ్మతో ఆరోగ్యం పదిలం

Feb 20,2024 10:34 #fruits

దానిమ్మలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దానిమ్మని గింజల రూపంలోనైనా, జ్యూస్‌ రూపంలో తీసుకున్నా ఒకే ఫలితం ఉంటుంది. శ్రీ దానిమ్మలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటిలో ప్యూనికల్గిన్‌, ఆంథోసైనిన్లు శక్తివంతమైనవి. ఈ సమ్మేళనాలు ఫ్రీ రాడికల్స్‌, అస్థిర అణువులకు వ్యతిరేకంగా పోరాడతాయి.

సెల్‌ డ్యామేజ్‌ని నివారిస్తాయి. ప్రతి రోజూ తాగడం వల్ల ఆక్సీకరణ ఒత్తిడితో పోరాడి, ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.శ్రీ దానిమ్మ రసం తాగడం వల్ల గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇందులోని అధిక యాంటీఆక్సిడెంట్‌ కంటెంట్‌ రక్తపోటును తగ్గిస్తుంది. కొలెస్ట్రాల్‌ స్థాయిలను తగ్గిస్తుంది. మొత్తం గుండె పనితీరును మెరుగుపరుస్తుంది. దానిమ్మ రసంలోని నైట్రిక్‌ ఆక్సైడ్‌ ధమనులను తెరుస్తుంది. రక్తం సాఫీగా ప్రవహిస్తుంది. గుండెపోటు, స్ట్రోక్‌ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

కీళ్లనొప్పులు, మధుమేహం, క్యాన్సర్‌తో సహా అనేక రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడేవారికి శరీరం లోపల అవయవాల్లో దీర్ఘకాలంగా మంటగా ఉంటుంది. దానిమ్మ రసంలో శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ సమ్మేళనాలు ఉండడం వల్ల, ఈ మంటను తగ్గించడంలో సహాయపడతాయి.

అధిక స్థాయిలో యాంటీ ఆక్సిడెంట్లు ఉండడం వల్ల క్యాన్సర్‌ కణాల పెరుగుదలను నిరోధించే లక్షణాలు ఉండవచ్చని పరిశోధనలు సూచిస్తున్నాయి. ఆ ప్రభావాలను పూర్తిగా అర్థం చేసుకోవడానికి మరింత పరిశోధన అవసరం అవుతుంది. అయినా రోజువారీ ఆహారంలో దానిమ్మ రసాన్ని జోడించడం వల్ల కొన్ని రకాల క్యాన్సర్లు వచ్చే ప్రమాదాన్ని తగ్గించవచ్చు.

దానిమ్మ రసంలో ఫైబర్‌ పుష్కలంగా ఉంటుంది, ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థకు ఇది చాలా అవసరం. ఇందులో ఉండే యాంటీ బాక్టీరియల్‌ లక్షణాలు జీర్ణవ్యవస్థలో హానికరమైన బ్యాక్టీరియాతో పోరాడటానికి సహాయపడతాయి.

➡️