ఒకరోజు మా స్కూలు సార్‌లు పోస్టల్‌కవర్లు, లెటర్లు, కార్డుల ఉపయోగం గురించి తెలియజేశారు. గతంలో పోస్టల్‌కవర్లు చాలా వాడేవారని, కాని ప్రస్తుత కాలంలో ఫోన్‌ల రాకతో ఉత్తరాలు కనుమరుగయ్యే దశకు చేరుకున్నామన్నారు. దాంతో ఉత్తరాలు రాయడం మూగపోయిందని చెప్పడం జరిగింది.
అప్పుడు నేనూ, మా తరగతి పిల్లలందరూ కలిసి పోస్టు కార్డులపై రకరకాల రంగులతో బొమ్మలు వేసి, కొత్త సంవత్సర శుభాకాంక్షలు చెపుతూ మా గురువులందరికీ పోస్టుల్లో పంపాము. వారు ఎంతో సంతోషపడి మమ్మల్ని అభినందించడం జరిగింది. మేము అందరమూ మళ్లీ సంక్రాంతి పండుగకు కూడా మా స్నేహితులందరికీ పోస్టు కార్డుపై బొమ్మలు వేసి( తక్కువ ఖర్చుతో) గ్రీటింగ్ కార్డులు పంపాము. మరి మీరూ కూడా ఉత్తరాలు రాసి పంపుతారా?.
వడాస్కర్ శ్రేషిత్
7వ తరగతి,
జెడ్పిఎస్‌ఎస్,
పెండల్‌వాడ,
ఆదిలాబాద్ జిల్లా.
