నేనొక కుక్కను పెంచాను
దానికి పాలు పోసాను
నేనొక మొక్కను పెంచాను
దానికి నీళ్ళు పోసాను
నేనొక బొమ్మను గీచాను
అమ్మకు దాన్ని చూపాను
నేనొక టోపీ కుట్టాను
నాన్నకు దాన్ని పెట్టాను
నేనొక రిబ్బన్ కొన్నాను
అక్కకు దానిని యిచ్చాను
నేనొక ‘స్టిక్కు’ను తెచ్చాను
తాతకు ఊతగ యిచ్చాను
నేనొక ఆపిల్ తెచ్చాను
టీచర్ కేమో యిచ్చాను
హేపీబర్తు డే అంటూ
టీచర్ నన్ను దీవించె !
స్నేహితులంతా వచ్చారు
షేక్ హాండునే యిచ్చారు
శుభాకాంక్షలు చెప్పారు
పండ్లను వారికి యిచ్చాను
డబ్బులు ఎక్కడివంటారా
డిబ్బిలోన దాచాను
అమ్మ,నాన్న యిచ్చినవి
అందులోన నే వేసాను
అమ్మకు ముద్దు పెట్టాను
నాన్న నడుము చుట్టాను
అక్కతొ ఆటలాడాను
తాతతో మాటలాడాను
కుక్కను ఎత్తుకున్నాను
మొక్కకు ఎరువును వేసాను!
పలకా బలపం తీసాను
అఆ ఇఈ రాసాను!
– కిలపర్తి దాలినాయుడు సాంఘిక శాస్త్రోపాధ్యాయుడు
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రామభద్రపురం