జ్ఞాపకశక్తి ఇలా మెరుగుపరుచుకోండి..

వయసుతో సంబంధం లేకుండా చిన్నా, పెద్దల్లో జ్ఞాపకశక్తి తగ్గుతోందని అందరికీ తెలిసిందే. అయితే ఈ మధ్య కాలంలో ఈ మతిమరుపు సమస్య యువతలో కూడా బాగా కనిపిస్తోంది. దీని నుండి బయటపడాలంటే, కొన్ని రకాల ఆహార పదార్థాలను మన రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలి.

  • ప్రతిరోజూ బాదం, వాల్‌నట్‌ లేదా జీడిపప్పు తీసుకుంటే జ్ఞాపకశక్తి మెరుగ్గా ఉంటుంది.
  •  క్యాబేజీ, ఉల్లిపాయలు, బ్రోకలీ వంటి కూరగాయలను రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలి. వాటిల్లో ఫ్లేవనాయిడ్లు ఉంటాయి. ఇవి జ్ఞాపకశక్తిని పెంచడంలో సహాయపడతాయి.
  •  పాలు, పెరుగు, కొవ్వు చేపలు, చిక్కుళ్ళు, బీన్స్‌, గుమ్మడి గింజలు, గోధుమలు, బార్లీ, వోట్స్‌ మొదలైన మెగ్నీషియం అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవడం వల్ల కూడా జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది.
  •  మొలకలు, బచ్చలికూర, క్యారెట్లు, చిలగడదుంపలు మొదలైన కూరగాయలను తీసుకోవడంతో పాటు పచ్చి కూరగాయలను ఆహారంలో ఎక్కువగా చేర్చుకోవాలి.
  •  గుడ్డు సొనలు, తృణధాన్యాలు, సోయాబీన్స్‌, నువ్వుల గింజలు లెసిథిన్‌ అనే పోషకాన్ని కలిగి ఉంటాయి. ఇది జ్ఞాపకశక్తిని, మెదడు పనితీరును మెరుగుపరచడంలో బాగా సహాయపడుతుంది.
  •  విటమిన్‌ బి12 పుష్కలంగా ఉండే గుడ్లు, చికెన్‌, చేపలు, పాలు వంటి ఆహారాలను తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి, అలాగే జ్ఞాపకశక్తి పెంచడంలో సహాయపడతాయి.
  •  నిమ్మ, నారింజ, ఉసిరి, క్యాప్సికం, ఆకు కూరలు వంటి విటమిన్‌ సి అధికంగా ఉండే సిట్రస్‌ పండ్లు, కూరగాయలను తీసుకోవడం వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుంది.
  •  బాదం, వాల్‌నట్‌లు, జీడిపప్పు, అత్తి పండ్లు, గింజలు వంటి విటమిన్‌- ఇ అధికంగా ఉండే ఆహారాన్ని తినడం వల్ల కూడా జ్ఞాపకశక్తి మెరుగ్గా ఉంటుంది.
➡️